ఆత్మహత్యాయత్నం చేసి చికిత్స పొందుతున్న ప్రముఖ గాయని కల్పన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. కేపీహెచ్ బీలోని ఓ విల్లాలో నివాసం ఉంటున్న కల్పన నిన్న నిద్రమాత్రలు మింగారు. ఆమె చెన్నైలో ఉంటున్న తన భర్తకు తాను నిద్రమాత్రలు మింగిన విషయం ఫోన్ చేసి చెప్పారు.
కల్పన భర్త ఇచ్చిన సమాచారం మేరకు విల్లా ఇరుగు పొరుగు వాళ్లు తలుపులు పగలగొట్టి ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. నిద్రమాత్రలు మింగడం వల్ల కలిగిన ఇన్ఫెక్షన్ తో పాటు ఊపిరితిత్తుల్లో నీరు చేరిందని, ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కల్పనను పరామర్శించేందుకు సింగర్స్ సునీత, గీతామాధురి, శ్రీకృష్ణ తదితరులు ఆస్పత్రికి వెళ్లారు.