డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ చిత్రాలతో వరుసగా రెండు బ్లాక్ బస్టర్స్ సాధించాడు సిద్దు జొన్నలగడ్డ. ఇలా రెండు సినిమాలతో బ్లాక్ బస్టర్ సాధించడంతో సిద్దుకు డిమాండ్ బాగా పెరిగింది. దీంతో వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయ్యాడు. ముందుగా ఏప్రిల్ 10న జాక్ మూవీతో వస్తున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా ఈ మూవీ రూపొందుతోంది. ఈ యాక్షన్ డ్రామాలో సిద్దు రొమాంటిక్ ప్రపంచానికి దూరంగా కనిపించబోతున్నాడని టాక్. ఈ మూవీ తర్వాత నీరజ కోన డైరెక్షన్ లో తెలుసు కదా అనే మూవీ చేస్తున్నాడు. ఈ ఇయర్ ఎండింగ్ లో రిలీజయ్యే ఛాన్స్ ఉంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ నిర్మిస్తోన్న కోహినూర్ మూవీ వచ్చే సంవత్సరం రిలీజ్ కానుంది. ఇలా టిల్లు హీరో మూడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.
ఇటీవలే సిద్దు జొన్నలగడ్డకు పరశురామ్ చెప్పిన స్టోరీ ఓకే అయ్యిందని.. ఈ ప్రాజెక్టు త్వరలో సెట్స్ పైకి రాబోతుందని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించనున్నారు. ఫ్యామిలీ స్టార్ మూవీ ఫ్లాప్ అయిన తర్వాత పరశురామ్ దిల్ రాజు బ్యానర్ లోనే మరో సినిమా చేసేందుకు అంగీకారం కుదిరింది. కాకపోతే హీరో ఫైనల్ కాకపోవడం వలన ప్రాజెక్ట్ ఆలస్యం అయ్యింది. బ్యాక్ డ్రాప్ ఏదనేది ఇంకా బయటికి రాలేదు కానీ ఎంటర్ టైన్మెంట్ జానరేనని టాక్. మరి.. పరశురామ్ ఈ మూవీతో మళ్లీ ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి.