“సలార్” డబ్బింగ్ మొదలుపెట్టిన శృతి హాసన్

ప్రభాస్ పాన్ ఇండియా మూవీ సలార్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకుంటున్నాయి. ఈ సినిమాను హోంబలే ఫిలింస్ బ్యానర్ పై దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్నారు. సెప్టెంబర్ 28న వరల్డ్ వైడ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇక తాజాగా ఈ సినిమా అప్ డేట్ చెప్పింది హీరోయిన్ శృతి హాసన్. సలార్ కు డబ్బింగ్ చెబుతున్నట్లు ఆమె వెల్లడించింది. డబ్బింగ్ స్టూడియోలో ఉన్న ఫొటోను ఇన్ స్టాలో షేర్ చేసింది.

నేను ఏ సినిమాకు డబ్బింగ్ చెబుతున్నానో గెస్ చేయండి అంటూ క్యాప్షన్ రాసింది శృతి. ఈ సినిమా యాక్షన్ ఎమోషన్ కలిసి ఉంటుందని గతంలో వెల్లడించిందీ భామ. ఎంత గొప్ప ఎమోషన్ ఉంటే అంత బాగా యాక్షన్ ను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. సలార్ ఆ ఫీల్ ను కలిగిస్తుందని శృతి చెప్పింది. సెప్టెంబర్ 28 రిలీజ్ సలార్ టీమ్ పనులు స్పీడప్ చేసింది. మరోవైపు ఈ సినిమా ఫారిన్ రిలీజ్ కు కూడా సన్నాహాలు ఊపందుకున్నాయి. యూఎస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించారు. అక్కడ సలార్ కు రికార్డ్ స్థాయిలో ప్రీ సేల్స్ జరుగుతున్నాయి.