పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ది రాజాసాబ్, ఫౌజీ సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ది రాజాసాబ్ ను మారుతి తెరకెక్కిస్తుంటే.. ఫౌజీ చిత్రాన్ని హను రాఘవపూడి రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రభాస్ నటించని పాత్రలో ఫౌజీలో నటించనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇందులో బ్రిటీష్ కాలానికి చెందిన సైనికుడుగా ప్రభాస్ నటిస్తున్నట్టుగా టాక్ వచ్చింది.
ఫౌజీ షూటింగ్ అప్డేట్ చూస్తే.. ఈ సినిమా కోసం మధురైలో ఓ షెడ్యూల్ ప్లాన్ చేశారు. అక్కడ హీరో ఫ్యామిలీకి సంబంధించిన సన్నివేశాలు తెరకెక్కిస్తారు. ఇందులో ప్రభాస్ ఓ బ్రాహ్మణ యువకుడిగా కనిపించబోతున్నాడని సమాచారం. అగ్రహారం సెటప్ లో ఈ సీన్లు చిత్రీకరిస్తారు. ఫిబ్రవరిలో ఓ 20 రోజుల పాటు ఈ షెడ్యూల్ సాగుతుందట. ఆ తర్వాత ది రాజాసాబ్ షూటింగ్ లో పాల్గొంటాడని.. అలాగే కల్కి 2 స్టోరీ సిట్టింగ్స్ లో కూడా పాల్గొంటాడని తెలిసింది. మరో వైపు స్పిరిట్ కు సంబంధించిన కథాచర్చలు కూడా జరుగుతున్నాయి.