షాక్ ఇచ్చిన మిల్కీబ్యూటీ

మిల్కీబ్యూటీ అనగానే ఠక్కున తమన్నా గుర్తొస్తుంది. ఈ అమ్మడు పద్దెనిమిది సంవత్సరాలుగా నటిస్తుంది. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే.. ఇప్పటి వరకు ఒక్క ముద్దు సీన్ లో కూడా నటించలేదు. అయితే.. వెబ్ సిరీస్ లో మాత్రం ఊహించని విధంగా సెక్స్ సీన్లలో నటించి అందరికీ షాక్ ఇచ్చింది. ఆమె నటించిన జీ కర్దా అనే వెబ్ సిరీస్ ఈ రోజు విడుదలైంది. అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం అవుతోంది. ఈ సిరీస్ నిండా ఆమె సెక్స్ సీన్లు ఉన్నాయి. ఆమెతో రకరకాల బెడ్ రూమ్ భంగిమలు, దృశ్యాలు చిత్రీకరించారు. తమన్న వీటికి ఒప్పుకోవడం నిజంగా షాక్ అని చెప్పచ్చు.

రాయలేనటువంటి డైలాగులు ఉన్నాయి. ఆమె బోల్డ్ గా నటించడం పై మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు ఆమె డేరింగ్ ని మెచ్చుకుంటుంటే…. చాలా మంది మాత్రం విమర్శిస్తున్నారు. ఆమె సెక్స్ సీన్లలో నటించిన మొదటి వెబ్ సిరీస్. తర్వాత లస్ట్ స్టోరీస్ 2 నెట్ ఫ్లిక్స్ లో రానుంది. అందులో తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో ఎలాంటి కెమిస్ట్రీ పండించిందో అనేది ఆసక్తిగా మరింది. మరి.. వస్తున్న విమర్శల పై తమన్నా ఎలా స్పందిస్తుందో చూడాలి.