స్ట్రీమింగ్ కు వచ్చేసిన ‘శివం భజే’

అశ్విన్ బాబు(Ashwin babu), దిగాంగనా సూర్యవంశీ(Digangana suryavamsi) హీరో హీరోయిన్లుగా నటించిన ‘శివం భజే'(Shivam bhaje) సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అమోజాన్ ప్రైమ్ వీడియో(Amazon prime video)లో ఈ సినిమా ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ అ‌వుతోంది. ఈ చిత్రాన్ని గంగా ఎంటర్టైన్మంట్స్ బ్యానర్ మీద దర్శకుడు అప్సర్ రూపొందించారు. ఈ నెల 1న థియేటర్స్ లోకి వచ్చింది ‘శివం భజే’.

సైన్స్ ఫిక్షన్, మైథాలజీ అంశాలు కలిపిన యాక్షన్ డ్రామాగా ‘శివం భజే’ సినిమా రూపొందింది. ఈ సినిమా థియేటర్స్ లో అంతగా ఆదరణ పొందలేదు. ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగినా..ఆ తర్వాత థియేటర్స్ నుంచి కలెక్షన్స్ పెద్దగా రాలేదు. ఇప్పుడు ఓటీటీలో వచ్చే రెస్పాన్స్ కోసం మూవీ మేకర్స్ ఎదురుచూస్తున్నారు. మేకింగ్, విలన్ క్యారెక్టర్ కు సంబంధించిన ట్విస్టులు ‘శివం భజే’కు ఆకర్షణగా నిలిచాయి.