శర్వానంద్ – సంపత్ నంది కాంబోలో మూవీ

హీరో శర్వానంద్ దర్శకుడు సంపత్ నంది కాంబోలో ఓ మూవీ రెడీ అవుతోంది. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించనుందని టాక్ వినిపిస్తోంది. ఈ కాంబోలో సినిమాకు డిస్కషన్స్ పూర్తయ్యాయని, త్వరలోప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది. శర్వానంద్ కొత్త సినిమా మనమే ఈ నెల 7వ తేదీన రిలీజ్ కు రెడీ అవుతోంది. కూల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా మనమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇక సంపత్ నంది దర్శకుడిగా, నిర్మాతగా మూవీస్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ప్రొడక్షన్ లో ఓదెల 2 సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. తమన్నా ఈ చిత్రంలో లీడ్ రోల్ చేస్తోంది. దర్శకుడిగా సంపత్ నందికి సాయి దుర్గతేజ్ హీరోగా గాంజా శంకర్ సినిమా ఉంది. ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా టైటిల్ వివాదం నేపథ్యంలో షూటింగ్ లేటవుతోంది. గాంజా శంకర్ టైటిల్ మార్చాలంటూ పోలీసులు ఈ మూవీ టీమ్ కు నోటీసులు ఇచ్చారు.