మహేశ్ తో కలిసి “జవాన్” చూస్తానన్న షారుఖ్

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కొత్త సినిమా జవాన్ రిలీజ్ కు రెడీ అవుతోంది. రేపు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో తెరపైకి రాబోతోంది. ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు కూడా ఎదురుచూస్తున్నారు. ఈ క్రేజ్ లో సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా ఉన్నారు. జవాన్ సినిమాను ఫ్యామిలీతో చూస్తానంటూ మహేశ్ బాబు ట్వీట్ చేశారు. జవాన్ టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు.

మహేశ్ ట్వీట్ కు స్పందించిన షారుఖ్ థాంక్స్ చెప్పారు. మహేశ్ చూసే టైమ్ అండ్ ప్లేస్ తాను ఆయనతో కలిసి జవాన్ చూస్తానని రీట్వీట్ చేశాడు. ఈ స్టార్ హీరోల ట్వీట్, రీట్వీట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో షారుఖ్, మహేశ్ సినిమాల షూటింగ్స్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతున్నప్పుడు వీరిద్దరు మీట్ అయ్యారు. అప్పటి ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

షారుఖ్, నయనతార, దీపిక పదుకోన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించిన జవాన్ చిత్రాన్ని దర్శకుడు అట్లీ రూపొందించారు. ఈ సినిమాకు భారీ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. ఫస్ట్ డే జవాన్ సినిమాకు నాలుగు లక్షల టికెట్స్ నేషనల్ వైడ్ బుక్ అయ్యాయి.