రామ్ చరణ్(Ram charan) హీరోగా దర్శకుడు శంకర్(Shankar) రూపొందిస్తున్న గేమ్ ఛేంజర్ షూటింగ్ ఓ మెగా డైలీ సీరియల్ లా సాగుతూనే ఉంది. నాలుగేళ్ల తర్వాత రామ్ చరణ్ తన పార్ట్ కంప్లీట్ చేశాడు. డిసెంబర్ 25న రిలీజ్ అంటూ దిల్ రాజు(Dil raju) ప్రకటించాడు. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇప్పుడు కథ మళ్లీ మొదటి తీసుకొస్తున్నాడట దర్శకుడు శంకర్.
ఈ సినిమాకు సంబంధించి కొన్ని రీషూట్స్ ను దిల్ రాజు, రామ్ చరణ్ లకు చెప్పాడట శంకర్. ఇందుకోసం మళ్లీ రామ్ చరణ్ డేట్స్ కావాలని అడుగుతున్నాడట. శంకర్ మాటలతో దిల్ రాజు, రామ్ చరణ్ ఏం చెప్పాలో తోచని పరిస్థితిలో పడుతున్నారు. రామ్ చరణ్ బుచ్చిబాబుతో సినిమా కోసం రెడీ అవుతుండగా..ఆర్థిక భారమైన ఈ ప్రాజెక్ట్ ను వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని దిల్ రాజు భావిస్తున్నారు. ఈ టైమ్ లో మళ్లీ రీ షూట్స్ అంటే శంకర్ అంత త్వరగా ఫినిష్ చేస్తాడా, ఇది క్రిస్మస్ కు రిలీజ్ అవుతుందా అనే సందేహాలు మొదలవుతున్నాయి.