“ముత్తయ్య” లాగే మీ కలల్ని నిజం చేసుకోండి – విజయ్ దేవరకొండ

కలల్ని నిజం చేసుకునేందుకు వయసు అడ్డు కాదు. 60 ఏళ్ల ముత్తయ్య సినిమాల్లో నటించాలనే తన కల కోసం ఇలాగే పట్టుదలగా ప్రయత్నిస్తుంటాడు. అతని ప్రయత్నం ఫలించిందా లేదా అనేది త్వరలో ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కు వస్తున్న ముత్తయ్య సినిమాలో చూడాలి. కె. సుధాకర్ రెడ్డి, అరుణ్ రాజ్, పూర్ణ చంద్ర, మౌనికా బొమ్మ ప్రధాన పాత్రల్లో నటించిన ముత్తయ్య సినిమా నుంచి ఈ రోజు సెకండ్ సింగిల్ ‘సీనిమాల యాక్ట్ జేశి..’ రిలీజ్ చేశారు స్టార్ హీరో విజయ్ దేవరకొండ. లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయని, అవన్నీ ఎదుర్కొని మన కలల్ని ముత్తయ్య లాగే నిజం చేసుకోవాలని విజయ్ దేవరకొండ ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. ముత్తయ్య టీమ్ కు విజయ్ తన బెస్ట్ విశెస్ అందించారు.

‘సీనిమాల యాక్ట్ జేశి..’ పాట నటుడు కావాలని ముత్తయ్య చేసే ప్రయత్నాలను ఆకట్టుకునేలా చూపించింది. ఈ పాటకు డైరెక్టర్ భాస్కర్ మౌర్య లిరిక్స్, కార్తీక్ రోడ్రిగ్వ్ మ్యూజిక్ ఆకర్షణగా నిలుస్తున్నాయి. సింగర్ చిన్నా.కె ఆకట్టుకునేలా పాడారు. ‘ముత్తయ్య’ చిత్రాన్ని దర్శకుడు భాస్కర్ మౌర్య రూపొందించారు. హైలైఫ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఫిక్షనరీ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పి బ్యానర్లపై వంశీ కారుమంచి, వృందా ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. దివాకర్ మణి ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ మరియు సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు.