ఓటీటీలోకి వచ్చేసిన సత్యదేవ్ “జీబ్రా”

సత్యదేవ్ హీరోగా నటించిన జీబ్రా సినిమా ఓటీటీలోకి వచ్చింది. నేటి నుంచి ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా ఆహా గోల్డ్ సబ్ స్క్రైబర్స్ కోసం అందుబాటులో ఉంది. గత నెల 22న జీబ్రా థియేటర్స్ లోకి వచ్చింది. థియేటర్స్ లో ఈ సినిమాకు పెద్దగా రెస్పాన్స్ రాలేదు. నెల రోజుల్లోపే ఓటీటీలోకి జీబ్రా స్ట్రీమింగ్ కు వచ్చింది.

ఈ చిత్రాన్ని క్రైమ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ రూపొందించారు. పద్మజ ఫిలింస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఓల్డ్‌ టౌన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై ఎస్‌ఎన్‌ రెడ్డి, ఎస్‌ పద్మజ, బాల సుందరం, దినేష్‌ సుందరం నిర్మించిన ఈ చిత్రంలో ప్రియ భవానీ శంకర్, అమృత అయ్యర్ హీరోయిన్స్ గా నటించారు. కన్నడ నటుడు ధనుంజయ మరో కీ రోల్ చేశారు.