నేటివిటీతో ఆకట్టుకుంటున్న “సర్కారు నౌకరి” కొత్త పాట ‘నీళ్లా బాయి..’

మోర్ లోకల్ మోర్ గ్లోబల్ అనే ట్రెండ్ వచ్చేసింది. ఎంత స్థానిక కథ చెబితే అది అంత విస్తృతంగా ప్రేక్షకులకు చేరుతోంది. నేటివిటీతో వస్తున్న చిన్న చిత్రాలు అందుకే ఘన విజయాలు సాధిస్తున్నాయి. అలాంటి ఇంప్రెషన్ కలిగిస్తున్న సినిమా “సర్కారు నౌకరి”. ప్రముఖ సింగర్ సునీత కుమారుడు ఆకాష్ హీరోగా పరిచయవుతున్న ఈ సినిమాలో భావన హీరోయిన్ గా నటిస్తోంది. ఆర్కే టెలీ షో బ్యానర్ పై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మిస్తున్న “సర్కారు నౌకరి” చిత్రానికి గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన నీళ్లాభాయ్ లిరికల్ సాంగ్ ఎంతో నేటివ్ గా ఉండి ఆకట్టుకుంటోంది. శాండిల్య పీసపాటి స్వరపర్చిన ఈ పాటకు పసునూరి రవీందర్ సాహిత్యాన్ని అందించగా సోని కొమండూరి ఆకట్టుకునేలా పాడారు. ‘నీళ్లా భాయి నిమ్మళంగా అడిగే .ఈ సక్కని సుక్కా లగ్గమెప్పుడని, ఎగిరే గువ్వ, ఎన్నెలోలె నవ్వే..ఆ పప్పు బువ్వ సందడెప్పుడని..’అంటూ పెళ్లి చూపుల సందర్భంగా అమ్మాయి మనసులో కలిగే ఎమోషన్స్, కాబోయో భర్త గురించి మొదలయ్యే ఊహలతో ఈ పాట సాగుతూ మ్యూజిక్ లవర్స్ ను మెప్పించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.