సంక్రాంతి స్పెషల్ పోస్టర్ తో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్న “సంతాన ప్రాప్తిరస్తు”

ఇటీవల కాలంలో ప్రేక్షకుల్లో ఎక్కువ ఆసక్తిని కలిగించిన సినిమా “సంతాన ప్రాప్తిరస్తు”. ఈ సినిమాకు సెలెక్ట్ చేసుకున్న కాన్సెప్టే అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. “సంతాన ప్రాప్తిరస్తు” చిత్రంలో విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రచయిత షేక్ దావూద్ జి స్క్రీన్ ప్లే రాస్తున్నారు. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా తెరకెక్కుతోంది.

ఈ రోజు మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో హీరో విక్రాంత్, హీరోయిన్ చాందినీ ఆకట్టుకుంటున్నారు. పోస్టర్ లో ప్రెగ్నెన్సీ కిట్ ఉండటం ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.