సంక్రాంతికి వస్తున్నాం – టీవీ, ఓటీటీ రెండూ ఒకే రోజు ప్రీమియర్

వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఓటీటీ, టీవీ ప్రీమియర్ ఒకే రోజున ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమా మార్చి 1వ తేదీన జీ తెలుగుతో పాటు జీ5 ఓటీటీలోనూ స్ట్రీమింగ్ కు వస్తోంది. టీవీ, ఓటీటీ ప్రీమియర్ ఒకే రోజున జరగడం ఇదే తొలిసారి. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ కాబట్టి ప్రేక్షకులు తమకు అందుబాటులో ఉన్న మాధ్యమంలో ఈ సినిమాను చూడబోతున్నారు.

దిల్ రాజు, శిరీష్ నిర్మాణంలో దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని రూపొందించారు. సంక్రాంతి రిలీజ్ కు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. మూవీ టీమ్ ఊహించని కలెక్షన్స్ ను రాబట్టింది. గేమ్ ఛేంజర్ నష్టాలతో డీలా పడిన నిర్మాత దిల్ రాజుకు సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్ మోరల్ సపోర్ట్ ఇచ్చింది.