సంక్రాంతికి వస్తున్నాం – ఓటీటీ కంటే ముందే టీవీలోకి

వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా టీవీ ప్రీమియర్ డేట్ కన్ఫర్మ్ చేసుకుంది. ఓటీటీ కంటే ముందే ఈ సినిమా టీవీ టెలికాస్ట్ కు రెడీ కావడం విశేషం. జీ తెలుగు సంక్రాంతికి వస్తున్నాం సినిమాను మార్చి 1వ తేదీన ప్రీమియర్ చేస్తున్నట్లు ప్రకటించింది. సోషల్ మీడియాలో ఈ అనౌన్స్ మెంట్ చక్కర్లు కొడుతోంది.

దిల్ రాజు, శిరీష్ నిర్మాణంలో దర్శకుడు అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం సినిమాను రూపొందించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్స్ గా నటించారు. సంక్రాంతికి థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంచనాలు మించే విజయాన్ని సాధించింది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కాబట్టి జీ తెలుగు ప్రీమియర్ లో భారీగా టీఆర్పీ రేటింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓటీటీ రిలీజ్ డేట్ ను కూడా త్వరలోనే ప్రకటిస్తారని తెలుస్తోంది.