వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా యూఎస్ బాక్సాఫీస్ వద్ద జోరు చూపిస్తోంది. ఈ సినిమా యూఎస్ లో 700కే వసూళ్లను సాధించింది. 1 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ దిశగా రన్ అవుతోంది. సంక్రాంతి సీజన్ కావడం, సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్ కు నచ్చడంతో వసూళ్లు పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది.
గేమ్ ఛేంజర్ తో మిక్స్డ్ రెస్పాన్స్ చూసిన నిర్మాత దిల్ రాజుకు సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిజల్ట్ కొంత రిలీఫ్ గా మారింది. ఈ సినిమాతో దర్శకుడు అనిల్ రావిపూడి మరో హిట్ అందుకున్నట్లయింది. ఆయన గత సినిమా భగవంత్ కేసరి సక్సెస్ అయ్యింది. ఇప్పుడీ మూవీతో కూడా అనిల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఫస్ట్ వీకెండ్ కు సంక్రాంతికి వస్తున్నాం సినిమా కలెక్షన్స్ మరింత ఇంప్రెసివ్ గా ఉండనున్నాయి.