ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న “మజాకా”

సందీప్ కిషన్ హీరోగా నటించిన లేటెస్ట్ ఫ్లాప్ మూవీ మజాకా ఓటీటీ డేట్ కన్ఫర్మ్ చేసుకుంది. ఈ సినిమా జీ5లో ఈ నెల 28వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఓటీటీ ట్రైలర్ పోస్ట్ చేస్తూ జీ5 ఈ అనౌన్స్ మెంట్ చేసింది. మజాకా చిత్రంలో రీతూ వర్మ హీరోయిన్ గా నటించగా..రావు రమేష్, అన్షు ఇతర కీ రోల్స్ చేశారు.

ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ నిర్మించగా..త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించారు. గత నెల 26న థియేటర్స్ లోకి వచ్చిన మాజాకా సినిమా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. ఇప్పుడు ఓటీటీలో వచ్చే రిజల్ట్ కోసం మూవీ టీమ్ వెయిట్ చేస్తోంది.