నెంబర్ 1 ప్లేస్ లో సమంత

ఓర్మాక్స్ మీడియా సంస్థ జాతీయస్థాయిలో మోస్ట్ పాప్యులర్ ఫిమేల్ స్టార్స్-2023 అనే జాబితా రూపొందించింది. ఈ లిస్ట్ లో టాప్ 10లో నిలిచిన వారి వివరాలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఇందులో ప్రముఖ నటి సమంత ఈ జాబితాలో నెంబర్ వన్ గా నిలిచింది. ఇందులో అలియా భట్, దీపిక పదుకొణే వంటి బాలీవుడ్ భామలను, నయనతార వంటి దక్షిణాది లేడీ సూపర్ స్టార్ ను కూడా వెనక్కి నెట్టి సమంత అగ్రస్థానాన్ని అందుకోవడం విశేషం.

1. సమంత రూత్ ప్రభు, 2. అలియా భట్, 3. దీపిక పదుకొణే, 4. నయనతార, 5. కాజల్ అగర్వాల్, 6. త్రిష, 7. కత్రీనా కైఫ్, 8. కియారా అద్వానీ, 9. కీర్తి సురేశ్
10.రష్మిక మందన్న. సమంత ఫ్యామిలీ మేన్ వెబ్ సిరీస్ లో నటించి జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది. అనారోగ్యం సైతం సమంత పట్టుదల ముందు ఓడిపోయిందని చెప్పచ్చు. ఇప్పుడు ఖుషి సినిమాలో నటించింది. సెప్టెంబర్ 1న ఖుషి సినిమా విడుదల కానుంది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా పాప్యులరైన సిటాడెల్ వెబ్ సిరీస్ ఇండియన్ వెర్షన్ లోనూ నటిస్తోంది.