స్టార్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ సమంత తమ కొత్త సినిమా ఖుషి ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కోసం స్పెషల్ ఇంటర్వూస్ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూస్ లోని కొన్ని మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వాటిలో సమంత విజయ్ దేవరకొండ లైఫ్ స్టైల్ గురించి చెప్పిన కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
సమంత మాట్లాడుతూ – విజయ్ దేవరకొండను రౌడీ స్టార్ అంటారు. ఆయన రియల్ లైఫ్ లో కూడా రఫ్ గా ఉంటాడని అనుకుంటారు కానీ విజయ్ అలా ఉండరు. ఆయనకు ఒక్క బ్యాడ్ హ్యాబిట్ లేదు. రోజూ వర్కవుట్స్ చేశారు. కెరీర్ విషయంలో ఫోకస్డ్ గా ఉంటారు. విజయ్ ను దగ్గరగా చూసినప్పుడు, ఆయన గురించి తెలుసుకున్నప్పుడు నేను కూడా మీలాగే ఆశ్చర్యపోయాను. అని చెప్పింది.
సమంత విజయ్ గురించి చేసిన ఈ కామెంట్స్ చాలా మందికి విజయ్ గురించి క్లారిటీ ఇచ్చాయి. ఇక ఖుషి సినిమా మరికొద్ది రోజుల్లో స్క్రీన్స్ మీదకు రాబోతోంది. పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 1న రిలీజ్ అవుతోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో దర్శకుడు శివ నిర్వాణ రూపొందించారు.