హీరోయిన్ సమంత సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లతో మంచి పేరు తెచ్చుకుంది. ఆమె నటించిన ఫ్యామిలీ మ్యాన్ 2 రికార్డ్ స్థాయి విజయాన్ని అందుకుంది. ఈ ఫేమ్ తో ఆమె సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ లో నటించింది. వరుణ్ ధావన్ తో కలిసి సమంత ఈ సిరీస్ లో కనిపించింది. అయితే సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ ఆశించిన విజయాన్ని అందుకోలేదు. భారీ ఖర్చుతో ప్రైమ్ వీడియో నిర్మించిన ఈ వెబ్ సిరీస్ కు ఆదరణ దక్కలేదు.
దాంతో ఇప్పుడు ఈ సిరీస్ సెకండ్ సీజన్ ను ఆపేయాలని అమోజాన్ ప్రైమ్ వీడియో నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ లో సమంత ఎన్నో యాక్షన్ సీక్వెన్సులు చేసింది. అప్పటికి తాను ఇంకా అనారోగ్యం నుంచి కోలుకోకున్నా ప్రమాదకరమైన స్టంట్స్ చేసి ఆకట్టుకుంది. మరోవైపు వరుణ్ ధావన్ తో సమంత లిప్ లాక్స్ కూడా సెన్సేషన్ అయ్యాయి. సిటాడెల్ కోసం సమంత పడిన కష్టం సీజన్ 2 రద్దుతో వృథానే అయ్యిందనే టాక్ వినిపిస్తోంది.