సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న సికిందర్ మూవీ టీజర్ యూట్యూబ్ వ్యూస్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ఈ టీజర్ కు ఇప్పటికే 2 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. యూట్యూబ్ లో సికిందర్ టీజర్ 2 ప్లేస్ లో ట్రెండింగ్ అవుతోంది. యాక్షన్ ప్యాక్డ్ గా కట్ చేసిన ఈ సినిమా టీజర్ ఆకట్టుకుంటోంది.
సౌత్ మూవీ స్టైల్ లో పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్, పంచ్ డైలాగ్స్ తో దర్శకుడు మురుగదాస్ ఈ సినిమాను రూపొందించినట్లు టీజర్ తో తెలుస్తోంది. టీజర్ లో రశ్మిక ఓ ఫ్రేమ్ లో మెరిసింది. ఆమె ఫస్ట్ టైమ్ సల్మాన్ సరసన కనిపించబోతోంది. సికిందర్ మూవీ ఈద్ పండక్కి రిలీజ్ కు రెడీ అవుతోంది.