సల్మాన్ ని టెన్షన్ పెడుతున్న సలార్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రం సలార్. ఈ చిత్రాన్ని కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్నారు. సెప్టెంబర్ 28న సలార్ రిలీజ్ కావాలి కానీ.. కొన్ని కారణాల వలన సలార్ రిలీజ్ వాయిదాపడింది. దీంతో సలార్ కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది ఆసక్తిగా మారింది. డిసెంబర్ లో వస్తుందని కొంత మంది అంటుంటే.. కాదు సంక్రాంతికి వచ్చే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. తాజాగా డిసెంబర్ లో కాదు.. సంక్రాంతిలో కాదు.. నవంబలో సలార్ రిలీజ్ అనే కొత్త వార్త బయటకు వచ్చింది.

సలార్ నవంబర్ లో రిలీజ్ కానుందనే వార్త సల్మాన్ ని టెన్షన్ పెడుతుందని టాక్ వినిపిస్తోంది. మేటర్ ఏంటంటే… సల్మాన్ నటించిన టైగర్ 3 మూవీ నవంబర్ 10న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. యష్ రాజ్ ఫిలింస్ ప్రస్తుతం సన్నాహాల్లో ఉంది. డేట్ ఇంకా అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ.. డిస్ట్రిబ్యూటర్లకు చెప్పిన తేదీ మాత్రం అదే. దీంతో టైగర్ 3 తో డైరెక్ట్ గా పోటీపడకపోయినా వారం ముందు కానీ.. వారం తర్వాత కానీ.. సలార్ వచ్చే ఛాన్స్ ఉంది. దీంతో ఏం జరగనుందో అనేది బాలీవుడ్ సైతం ఆసక్తిగా మారింది. అయితే.. సరైన ప్లానింగ్ లేకపోవడం వలన సెప్టెంబర్ 28 మంచి డేట్ ను మిస్ చేసుకుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.