పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రం సలార్. ఈ చిత్రానికి కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా టీజర్ వస్తుందా అని ఎదురు చూసిన రోజు వచ్చింది. ఈ టీజర్ ఇలా రిలీజ్ చేశారో లేదో.. అలా యూట్యూబ్ ని షేక్ చేస్తూ దూసుకెళుతుంది. ఈ టీజర్ 12 గంటల్లోనే 45 మిలియన్స్ కు పైగా వ్యూస్ సాధించడం విశేషం. దీనిన బట్టి సలార్ సినిమాకు ఎంతటి క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీని సెప్టెంబర్ 28న విడుదల చేయనున్నారు.
అయితే… ఈ చిత్రం అయితే తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ కి నాంది పలుకుతున్నట్టుగా తెలుస్తుంది. ఒక్క తెలుగు రాష్ట్రాల హక్కులే 200 కోట్లకి పైగా మేకర్స్ కోట్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దీనితోడు ఒక్క తెలుగు బిజినెస్ లోనే మరోసారి బిగ్గెస్ట్ బిజినెస్ నెంబర్ సలార్ కి లాక్ అయ్యేలా ఉందని చెప్పాలి. అయితే.. ఇది ఇంకా క్లోజ్ అవ్వలేదని తెలిసింది. బాహుబలి హీరో ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలిసి చేస్తున్న ఈ సినిమా పై పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి.. ఈ సినిమాతో ప్రభాస్ చరిత్ర సృష్టిస్తాడేమో చూడాలి.