పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కొత్త సినిమా సలార్ ట్రైలర్ కోసం అభిమానులు, మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ను ఈ నెలాఖరుకే రిలీజ్ చేస్తామని గతంలో టీజర్ విడుదల సందర్భంగా నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ వెల్లడించింది. సలార్ టీజర్ కు 100 మిలియన్ వ్యూస్ వచ్చిన సందర్భంగా ఈ ప్రకటన చేసింది. అయితే తాజాగా అప్ డేట్ ప్రకారం సలార్ ట్రైలర్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ చేయబోతున్నట్లు తలుస్తోంది.
సలార్ ట్రైలర్ ను సెప్టెంబర్ 7న రిలీజ్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. అదే నెల 28న సినిమా విడుదల కాబట్టి మధ్యలో మూడు వారాల గ్యాప్ ఉండనుంది. ట్రైలర్ తో సలార్ మీద పూర్తి అంచనా ఏర్పడనుంది. ఇప్పటికే ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో సలార్ ను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. యూఎస్ లో దాదాపు రెండున్నర లక్షల డాలర్స్ టికెట్స్ ప్రీ సేల్స్ జరిగాయి. మరే భారతీయ చిత్రానికి ఇటీవల కాలంలో ఇంత క్రేజ్ రాలేదు.