రికార్డ్ ధరకు సలార్ శాటిలైట్, డిజిటల్, ఆడియో రైట్స్

స్టార్ హీరో ప్రభాస్ కొత్త సినిమా సలార్ మీద ఏర్పడుతున్న క్రేజ్ ఈ సినిమాకు జరుగుతున్న రికార్డ్ స్థాయి బిజినెస్ మీద క్లియర్ గా కనిపిస్తోంది. హోంబలే ఫిలింస్ బ్యానర్ లో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. రెండు భాగాల ఈ ప్రాజెక్ట్ నుంచి తొలి భాగం సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ త్వరలో స్క్రీన్ మీదకు రాబోతోంది. ఈలోగా సినిమా టీవీ, డిజిటల్, ఆడియో బిజినెస్ పూర్తయ్యింది.

సలార్ ఐదు భాషల (హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం) శాటిలైట్ హక్కులు స్టార్ మా దక్కించుకోగా..నెట్ ఫ్లిక్స్ ఇదే ఐదు భాషల స్ట్రీమింగ్ రైట్స్ పొందింది. స్టార్ మా, నెట్ ఫ్లిక్స్ ఎంత చెల్లించారు అనేది బయటకు రాకున్నా…సలార్ శాటిలైట్, డిజిటల్, ఆడియో హక్కులకు కలిపి హోంబలే ఫిలింస్ నిర్మాతలకు దాదాపు 350 కోట్ల రూపాయలు చెల్లించినట్లు తెలుస్తోంది. ఇది ఇటీవల కాలంలో మరే సినిమాకు జరగనంత భారీ బిజినెస్ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఈ నెల 28న రిలీజ్ కావాల్సిన సలార్ మూవీ పోస్ట్ పోన్ కాగా…త్వరలోనే రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తామని మేకర్స్ ఇవాళ అఫీషియల్ గా ప్రకటించారు.