రెబెల్ స్టార్ ప్రభాస్ బ్లాక్ బస్టర్ మూవీ సలార్ రీ రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమాను మార్చి 21న రీ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సమ్మర్ హాలీడేస్ కు ఆడియెన్స్ రెడీ అవుతున్న టైమ్ లో సలార్ విడుదలకు వస్తుండటం బాక్సాఫీస్ వద్ద మరోసారి రికార్డులకు పనిచెప్పనుంది.
2023 డిసెంబర్ 22న సలార్ రిలీజై ఘన విజయం సాధించింది. ఓటీటీలో సంవత్సరం పాటు ట్రెండింగ్ లో ఉండి కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. రెండు భాగాల ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందించారు. హోంబలే ఫిలింస్ సంస్థ నిర్మించింది. ప్రస్తుతం సెకండ్ పార్ట్ సలార్, శౌర్యంగపర్వ సెట్స్ మీదకు వెళ్లే సన్నాహాల్లో ఉంది.