గ్లోబల్ రిలీజ్ తో “సలార్” విశ్వరూపం

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కొత్త సినిమా సలార్ గ్లోబల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ అప్డేట్ ఇచ్చింది. ఫార్స్ ఫిలింస్ ద్వారా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నట్లు ట్వీట్ చేసింది. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లో సలార్ థియేట్రికల్ రిలీజ్ కాబోతోంది. ఒక తెలుగు సినిమా ఇలా గ్లోబల్ గా ప్రతి ఖండంలో రిలీజ్ అ‌వడం టాలీవుడ్ కు ప్రౌడ్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు.

డిసెంబర్ 22న సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ రిలీజ్ అవుతోంది. అయితే ఒక రోజు ముందుగానే డిసెంబర్ 21 ఓవర్సీస్ ప్రీమియర్స్ ప్రారంభమవుతాయి. ఈ విషయాన్ని హోంబలే ఫిలింస్ లేటెస్ట్ ట్వీట్ లో వెల్లడించింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ కోసం సినీ ప్రియులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా యూఎస్ టికెట్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.