పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ సలార్. ఇందులో ప్రభాస్ కు జంటగా శృతిహాసన్ నటిస్తుంది. బాహుబలి హీరో, కేజీఎఫ్ డైరెక్టర్ కలిసి సినిమా చేస్తుండడంతో పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా అప్ డేట్స్ కోసం అభిమానులే కాదు.. సామాన్య జనాలు కూడా ఎదురు చూస్తున్నారు. ఇటీవల సలార్ టీజర్ రిలీజ్ చేస్తే.. చాలా తక్కువ టైమ్ లోనే 100 మిలియన్స్ కు పైగా వ్యూస్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ఇక సలార్ ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే.. ఈ మొదటి సాంగ్ అతి త్వరలోనే రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నారు. ఆగష్ట్ ఫస్ట్ వీక్ లో ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రం సంగీత దర్శకుడు రవి బసృర్ అండ్ టీం ఈ మొదటి సాంగ్ పనుల్లోనే బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనితో ఏ క్షణాన అయినా సలార్ మ్యూజికల్ అప్ డేట్ రావచ్చు అని తెలుస్తోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి ఆ రేంజ్ సక్సెస్ ఫుల్ మూవీ రాలేదు. అభిమానులు సలార్ పైనే ఆశలు పెట్టుకున్నారు. సెప్టెంబర్ 28న సలార్ రిలీజ్ కానుంది. మరి.. సలార్ అందరి అంచనాలను అందుకుంటుందేమో చూడాలి.