పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కొత్త సినిమా సలార్ ఈ నెల 28న రిలీజ్ కావాల్సి ఉండగా…వచ్చే జనవరికి పోస్ట్ పోన్ అయ్యింది. ఈ నేపథ్యంలో సలార్ యూఎస్ అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకున్న ప్రేక్షకులకు ఆ డబ్బులు తిరిగి చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీని కమింగ్ సూన్ మూవీస్ లిస్టు నుంచి మార్చేస్తున్నారు. యూఎస్ లో హాఫ్ మిలియన్ డాలర్స్ కు పైగా ప్రీ సేల్ టికెట్ బుకింగ్స్ జరిగాయి.
సలార్ పోస్ట్ పోన్ న్యూస్ నిన్నటి నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కొన్ని విశ్వసనీయ మీడియా సంస్థలు కూడా ఈ సినిమా పోస్ట్ పోన్ ను కన్ఫర్మ్ చేస్తున్నాయి. అయితే సినిమా నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ సలార్ రిలీజ్ వాయిదాను ధృవీకరించలేదు.
రెండు భాగాలుగా సలార్ మూవీని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ ప్రెస్టీజియస్ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా కనిపించబోతున్నారు. సీజీ వర్క్ లో ఆలస్యం వల్లే సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ రిలీజ్ వాయిదా పడిందనే న్యూస్ తెలుస్తోంది. అయితే ఎందుకు వాయిదా వేశారనేది అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సిఉంది.