షూటింగ్ సన్నాహాల్లో “సలార్ 2”

రెబెల్ స్టార్ ప్రభాస్(Rebal star) సలార్ 2(Salaar 2) సినిమా సైలెంట్ గా షూటింగ్ సన్నాహాలు చేసుకుంటోంది. సలార్ 2 ఆలస్యంపై వస్తున్న రూమర్స్ కు చెక్ పెడుతూ ఈ సినిమా టీమ్ షూటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సలార్ 2 సినిమా కోసం మేకర్స్ తాజాగా ఓ భారీ సెట్ నిర్మిస్తున్నట్లు సమాచారం. యాక్షన్ సీక్వెన్సుల కోసం ఈ సెట్ ని రెడీ చేస్తున్నారు. ఈ భారీ యాక్షన్ సీక్వెన్సుతో త్వరలోనే సలార్ 2 షూటింగ్ ప్రారంభిస్తారని తెలుస్తోంది.

సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. వరల్డ్ వైడ్ గా రికార్డ్ స్థాయి కలెక్షన్స్ అందుకుంది. దీంతో సలార్ 2 శౌర్యంగ పర్వ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్(Hombale filims) బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తుండగా…దర్శకుడు ప్రశాంత్ నీల్(Prashant neel) రూపొందిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.