ఇద్దరు హీరోయిన్స్ తో “ఉస్తాద్..” సందడి

అఖిల్ స్పై థ్రిల్లర్ మూవీ ఏజెంట్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన హీరోయిన్ సాక్షి వైద్య. యంగ్ ఏజ్, మంచి లుక్స్ తో టాలీవుడ్ లో ఈ నాయిక మరిన్ని సినిమాలు చేయగలదు అనే హోప్స్ కలిగించింది. అయితే డెబ్యూ మూవీ ఏజెంట్ ఫ్లాప్ కావడం సాక్షికి పెద్ద బ్రేక్ పడినట్లయింది. ఏజెంట్ లో నటిస్తున్నప్పుడే సాక్షి ఫస్ట్ లుక్ బయటకొచ్చి కొన్ని ప్రాజెక్ట్స్ కు సంప్రదించారు. అలా ఆమె సైన్ చేసిన సినిమా వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న గాండీవధారి అర్జున.

గాండీవధారి అర్జున ఈ నెల 25న రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా మీద సాక్షి హోప్స్ పెట్టుకుంది. అయితే ఇంతలో ఆమెకు మరో భారీ ఆఫర్ దక్కినట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ హీరోగా దర్శకుడు హరీశ్ శంకర్ రూపొందిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ లో ఒక నాయికగా సాక్షి వైద్య ఎంపికైందని సమాచారం. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. మరో హీరోయిన్ కోసం సాక్షిని తీసుకున్నారట. ఏమైనా పవన్ తో సినిమా ఆఫర్ సాక్షిని మరో లీగ్ లోకి తీసుకెళ్లేదే.

మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పటికే ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తిచేసుకుంది. ఇక తాజాగా మరో షెడ్యూల్ కు రెడీ అవుతోంది. ఉస్తాద్ భగత్ సింగ్ తమిళ హిట్ ఫిల్మ్ తెరీ నుంచి ఇన్ స్పైర్ అయి చేస్తున్న సినిమా అంటూ టాక్ నడుస్తోంది.