వారియర్ లుక్ లో సర్ ప్రైజ్ చేస్తున్న సాయి దుర్గతేజ్

ఒక పెద్ద ప్రమాదం నుంచి కోలుకుని సిక్స్ ప్యాక్ ఫిట్ నెస్ సాధించడం మామూలు విషయం కాదు. ఎంతో డెడికేషన్, బలమైన లక్ష్యం ఉంటే తప్ప ఇలాంటి బాడీ బిల్డ్ చేయలేం. తన కొత్త సినిమా సంబరాల ఏటిగట్టు కోసం పట్టుదలగా ప్రయత్నించి యుద్ధవీరుడి లాంటి మేకోవర్ లోకి మారిపోయారు సుప్రీమ్ హీరో సాయిదుర్గ తేజ్. రీసెంట్ గా రామ్ చరణ్ చేతుల మీదుగా రిలీజ్ చేసిన ఈ సినిమా కార్నేజ్ లో వారియర్ లుక్ లో కనిపించి సర్ ప్రైజ్ చేశారు సాయిదుర్గ తేజ్.

ప్లానింగ్ డైట్, జిమ్ లో శ్రమించి సిక్స్ ప్యాక్ బాడీ బిల్డ్ చేశారు సాయిదుర్గ తేజ్. ఆయన ఈ లుక్ లోకి మారిపోవడం చూసి తను సంబరాల ఎటిగట్టు సినిమా కోసం పెట్టిన ఎఫర్ట్స్ ను ప్రతి ఒక్కరూ అప్రిషియేట్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా సంబరాల ఏటిగట్టు రూపొందుతోంది. ఈ సినిమా సాయిదుర్గతేజ్ కెరీర్ లో ఓ స్పెషల్ ప్రాజెక్ట్ కానుంది. సంబరాల ఏటిగట్టు చిత్రాన్ని సాయిదుర్గ తేజ్ 18వ చిత్రంగా నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. కొత్త దర్శకుడు రోహిత్ కేపీ రూపొందిస్తున్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 25న సంబరాల ఏటిగట్టు రిలీజ్ కానుంది.