పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన భారీ, క్రేజీ మూవీ బ్రో. ఈ చిత్రానికి సముద్రఖని డైరెక్టర్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్ర్కీన్ ప్లే – సంభాషణలు అందించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఈ నెల 28న బ్రో మూవీ విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ లో స్పీడు పెంచారు. ఇటీవల రిలీజ్ చేసిన మై డియర్ మార్కాండేయ అనే పాటకు అనూహ్యమైన స్పందన లభించింది.
ఈ సినిమా విడుదల సందర్భంగా సాయిధరమ్ తేజ్ కడప అమీన్ పీర్ దర్గాను సందర్భించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా తేజ్ మాట్లాడుతూ… కడపకు వస్తే.. దర్గాను దర్శించుకోవడం ఆనవాయితీ. ప్రమాదం నుంచి బయటపడడం అనేది పునర్జన్మ. దేవుడు పునర్జన్మ ఇచ్చాడు. అందుకే దేవుడుకు ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను అన్నారు. సినిమా గురించి చెప్పాలంటే… పవన్ మావయ్యతో కలిసి నటించడం అనేది మరచిపోలేని అనుభూతి. ఆయనతో కలిసి నటించడం అనేది అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్పారు.
రాజకీయాల గురించి స్పందిస్తూ.. మావయ్య జనసేన పార్టీలోకి వస్తారా అని అడుగుతున్నారు. రాజకీయాల పై అవగాహన ఉంటేనే రావాలి. ఈ విషయం పవన్ మావయ్య చెప్పారు. నేను సినిమాల్లోనే ఉంటాను. మావయ్య కూడా అదే చెప్పారు. పవన్ మావయ్య అంటే ప్రాణం అన్నారు. తేజ్ చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నెల 28న బ్రో అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మరి.. మేనమామ, మేనల్లుడు కలిసి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయం సాధిస్తారో చూడాలి.