వరలక్ష్మీ శరత్ కుమార్ నటించిన ‘శబరి’ చిత్రం సమీక్ష

Sabari

‘శబరి’ ఒక సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం, ఇందులో ప్రధాన పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ నటించారు. పాన్ ఇండియా స్థాయిలో అనేక భాషల్లో విడుదలైన ఈ చిత్రం అనిల్ కాట్జ్ దర్శకత్వంలో, మహేంద్రనాథ్ కూండ్ల ‘మహా మూవీస్’ బ్యానర్‌పై నిర్మించబడింది. అత్యున్నత స్థాయిలో నిర్మించిన ఈ చిత్రం థియేటర్లలో మంచి స్పందన పొందిన తర్వాత, ఇప్పుడు ‘సన్ నెక్స్ట్’ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

కథ:

సంజనా (వరలక్ష్మీ శరత్ కుమార్) ఒక సింగిల్ మదర్, తన భర్త అరవింద్ (గణేష్ వెంకట్రామన్)తో విడిపోయి, తన కూతురు రియా (బేబీ నివేక్ష)తో కలిసి కొత్త ఊర్లో జీవనం ప్రారంభిస్తుంది. అయితే, సూర్య (మైమ్ గోపి), ఒక మానసిక రోగి, ఆమెను వెంటాడి, ఆమెను చంపాలని అనుకుంటాడు. ఈ సమయంలో సంజనకు ఆమె స్నేహితుడు రాహుల్ (శశాంక్) సహాయం చేస్తాడు. సూర్య ఆమెను ఎందుకు వెంబడిస్తున్నాడు? అతనికి ఏమ్ కావాలి? ఆమె గతం ఏమిటి? ఈ ప్రశ్నలు కథలో ఆసక్తికరమైన మలుపులు తీసుకువస్తాయి.

నటీనటులు:

వరలక్ష్మీ శరత్ కుమార్ తల్లి పాత్రలో అద్భుతంగా నటించారు. ఆమె పాత్రలో ఒక సింగిల్ మదర్‌గా తన కూతుర్ని కాపాడుకోవడం కోసం చేసే పోరాటం, ఆమె వ్యక్తిగత స్వాతంత్య్రం కధలో బలాన్ని తెచ్చింది. ఆమె చెప్పే డైలాగులు ఒక మహిళ individualityని ప్రతిబింబిస్తాయి. ఒక ముఖ్యమైన సందర్భంలో ఆమె “నేను నా కూతుర్ని కాపాడుకోవడానికి ఎంత దూరం అయినా వెళ్తాను” అనే మాటలు తన పాత్రలోని బలాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి.

మరొక గొప్ప డైలాగ్ ఆమె ఉధృతతను తెలియజేస్తుంది: “ఎలా గైనా బ్రతకాలి అనుకునే వాళ్ళు, ఎలా గోల బ్రతికేస్తారు…కానీ ఇలాగే బ్రతకాలి అనుకునే వాళ్ళు బ్రతకడం కష్టమే… But I am ok with that”. ఈ డైలాగ్ ఆమె ప్రతిఘటనను, దృఢమైన స్వాభిమానాన్ని స్పష్టం చేస్తుంది.

మైమ్ గోపి విలన్ పాత్రలో భయంకరంగా నటించాడు. శశాంక్, గణేష్ వెంకట్రామన్ మరియు మిగిలిన నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక అంశాలు:

ఈ చిత్రంలో సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది, ప్రతి ఫ్రేమ్ నిశితమైన డిటైల్‌తో చిత్రీకరించబడింది. గోపీ సుందర్ సంగీతం మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చిత్రానికి మరింత ఉత్కంఠను, సస్పెన్స్‌ను తీసుకొచ్చాయి. అటు ఫారెస్ట్ సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్సులు విజువల్‌గా ఆకట్టుకుంటాయి. మైమ్ గోపి విలన్‌గా చేసిన ఎంట్రీ, యాక్సిడెంట్ సీక్వెన్సులు చాలా బాగా చిత్రీకరించబడ్డాయి.

ప్రొడక్షన్ విల్యూస్:

మహేంద్ర నాథ్ కూండ్ల తన తొలి సినిమాగా ‘శబరి’ని అత్యున్నత ప్రమాణాలతో నిర్మించారు. చిత్రంలోని ప్రొడక్షన్ విల్యూస్ చాలా బాగున్నాయి, విజువల్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. నిర్మాణంలో ఎలాంటి రాజీపడటం లేకుండా, అధిక నాణ్యతతో సినిమా రూపొందించబడింది.

చివరి మాట:

‘శబరి’ ఒక సైకలాజికల్ థ్రిల్లర్, ఎమోషన్, సస్పెన్స్ మరియు థ్రిల్‌ను అద్భుతంగా మిళితం చేసింది. ఈ చిత్రాన్ని అన్ని వయస్సుల ప్రేక్షకులు కుటుంబంతో కలిసి చూసి ఆనందించవచ్చు. ‘సన్ నెక్స్ట్’లో అందుబాటులో ఉండే ఈ చిత్రాన్ని ఒకసారి తప్పకుండా చూడాల్సిన సినిమా.

 

Rating:3.5/5