పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కొత్త సినిమా సలార్ రిలీజ్ వాయిదా పడిందంటూ కొన్ని వార్తలు డిజిటల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హోంబలే ఫిలింస్ పతాకంపై దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శృతి హాసన్ నాయికగా నటిస్తోంది. ఈ నెల 28న సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా వాయిదా పడిందంటూ వస్తున్న వార్తలు అభిమానులను కలవరపెడుతున్నాయి.
సలార్ పార్ట్ 1 సినిమాకు సంబంధించిన సీజీ వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదని, అందుకే సెప్టెంబర్ 28 నుంచి డిసెంబర్ 14వ తేదీకి వాయిదా పడిందని న్యూస్ చక్కర్లు కొడుతోంది. సలార్ మంత్ స్టార్ట్ అయ్యిందంటూ సంబరపడుతున్న సినీ ప్రియులను ఈ వార్త ఇబ్బంది పెడుతోంది. అయితే హోంబలే ఫిలింస్ నుంచి అఫీషియల్ గా ఈ విషయంపై ఎలాంటి అప్ డేట్ రాలేదు. మరోవైపు యూఎస్ లో సలార్ ప్రీ సేల్స్ రికార్డ్ స్థాయిలో జరుగుతున్నాయి.