కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటించిన రూల్స్ రంజన్ సినిమా ఈ నెల 28న రిలీజ్ కావాల్సి ఉండగా…అక్టోబర్ 6వ తేదీకి మారుస్తున్నట్లు మేకర్స్ ఇవాళ ప్రకటించారు. సలార్ స్లాట్ ఖాళీ అయిన వెంటనే ఆ తేదీకి రిలీజ్ అనౌన్స్ చేసుకున్న ఫస్ట్ సినిమా ఇదే. రిలీజ్ డేట్ మార్చేందుకు రీజన్స్ ఏంటన్నది మూవీ టీమ్ వెల్లడించలేదు.
ఇటీవల ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి రూల్స్ రంజన్ సినిమా మీద పాజిటివ్ వైబ్స్ ఏర్పడ్డాయి. కామెడీ, లవ్ స్టోరి, ఎమోషన్ అన్నీ ఉండటంతో సినిమా బాగుంటుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇలాంటి టైమ్ లో రిలీజ్ డేట్ షిప్ట్ చేయడం సర్ ప్రైజింగ్ గా ఉంది. ఈ సినిమాను ఏఎం రత్నం సమర్పణలో ఆయన కుమారుడు రత్నం కృష్ణ దర్శకుడిగా రూపొందించారు.