నెట్ ఫ్లిక్స్ లోకిి వచ్చేసిన “ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్ బియాండ్“

ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దర్శకుడు రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమా తెర వెనక విశేషాలతో ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్ బియాండ్ డాక్యుమెంటరీ ఇటీవల థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ డాక్యుమెంటరీని ప్రేక్షకులు లైట్ తీసుకున్నారు. ఎక్కడా థియేటర్స్ కు కూడా దొరకలేదు.

ఇలాంటి రిసెప్షన్ ఆర్ఆర్ఆర్ కు వస్తుందని ఎ‌వరూ ఊహించలేదు. బీ, సీ సెంటర్స్ లోనే కాదు ఏ సెంటర్స్ అయిన సిటీస్ లోనూ ఈ డాక్యుమెంటరీకి స్క్రీన్స్ లభించలేదు. దీంతో ఇప్పుడు ఓటీటీలోకి “ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్ బియాండ్“ వచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ అవుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమా తెరవెనక జరిగిన ప్రయత్నాలన్నీ ఈ డాక్యుమెంటరీలో చూపించారు.