జపాన్ లో నేటికీ దూసుకెళుతున్న ఆర్ఆర్ఆర్

ఆర్ఆర్ఆర్ మూవీ ఓ సంచలనం. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌, దర్శకధీరుడు రాజమౌళిల క్రేజీ కాంబినేషన్లో రూపొందిన ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ దగ్గర 1200 కోట్లు కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. ఆతర్వాత నాటు నాటు పాటకు గాను ఆస్కార్ అవార్డ్ దక్కించుకుని చరిత్ర సృష్టించింది. ఇప్పుడు జాతీయ అవార్డుల్లో కూడా తన సత్తా చూపించింది. అయితే… ఆర్ఆర్ఆర్ ఆమధ్య జపాన్ లో విడుదలైంది. అక్కడ ఇప్పటి వరకు ఉన్న రికార్డులను ఆర్ఆర్ఆర్ మూవీ క్రాస్ చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

ఆర్ఆర్ఆర్ మూవీ జపాన్ లో 500 రోజులు పూర్తి చేసుకుంది. అయినప్పటికీ ఇంకా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతుండడం విశేషం. జపాన్ లో ఆర్ఆర్ఆర్ మూవీ 500 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఈ పోస్ట్ వైరల్ అయ్యింది. ఆర్ఆర్ఆర్ మూవీ టాలీవుడ్, బాలీవుడ్ లో నే కాకుండా హాలీవుడ్ లో సైతం సంచలనం సృష్టించింది. బాహుబలి మూవీ రాజమౌళి గురించి మన దేశానికి తెలియచేస్తే… ఆర్ఆర్ఆర్ మూవీ రాజమౌళి గురించి ప్రపంచానికి తెలియచేసింది.