మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఓ హారర్ థ్రిల్లర్ లో నటిస్తున్నారు. ఈ సినిమాతో ప్రభాస్ తన కెరీర్ లో ఫస్ట్ టైమ్ ఒక హ్యూమరస్ హారర్ మూవీ అటెంప్ట్ చేస్తున్నారు. కొత్త జానర్ లో ఈ స్టార్ సినిమా చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ పై అందరిలో ఆసక్తి ఏర్పడుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తున్న ప్రభాస్, మారుతి కాంబో సినిమా ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది.
ఈ సినిమాకు టైటిల్ వేటలో పడ్డారు మూవీ టీమ్. రాయల్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే టైటిల్ ను కర్ఫర్మ్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నారని, తండ్రీ కొడుకులుగా ఈ క్యారెక్టర్స్ ఉంటాయని సమాచారం.
ఒక క్యారెక్టర్ లో ప్రభాస్ బాగా నవ్వించబోతున్నారట. ప్రభాస్ కు ఇలాంటి క్యారెక్టర్ చేయడం కొత్తగా ఉంటుందని దర్శకుడు మారుతి బిలీవ్ చేస్తున్నారు. ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. యంగ్ హీరోయిన్ రిద్ధి కుమార్ కూడా ఒక కీ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు గతంలో డీలక్స్ రాజా అనే టైటిల్ ప్రచారంలో ఉండేది.