ఈ సినిమా ఒక్కసారి ఓటీటీలో చూసేందుకు రూ.350 కట్టాల్సిందే

రణ్ వీర్ సింగ్, ఆలియా భట్ జంటగా దర్శకుడు కరణ్ జోహార్ రూపొందించిన సినిమా రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ. జూలైలో రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు దక్కించుకుంది. ఈ సినిమా థియేటర్ రన్ కంప్లీట్ చేసుకుని ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది. అయితే ఇందులో ఓ ట్విస్ట్ పెట్టారు నిర్మాతలు.

రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ సినిమా అమోజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అయితే ఇది ప్రైమ్ మెంబర్స్ అందరికీ అందుబాటులో లేదు. రెంట్ చెల్లించిన వారికి మాత్రమే చూసే వీలుంది. ఆ రెంట్ అందరు ఉలిక్కి పడేలా 349 రూపాయలుగా నిర్ణయించారు.

ఈ అమౌంట్ తో సదరు ఓటీటీని నెల రోజులకు పైగా చూడొచ్చు. అలాంటి టైమ్ లో రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ సినిమాను ఒక్కసారి చూసేందుకే ఇంత రెంట్ పెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. గతంలో అవతార్ సినిమాను ఇలాగే రెండు వేల రూపాయలకు రెంట్ కు ఓటీటీలో పెట్టడం టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.