నితిన్, శ్రీలీల జంటగా నటిస్తున్న రాబిన్ హుడ్ సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఈ నెల 25న ఈ సినిమా రిలీజ్ కు రావాల్సిఉండగా..నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ రాబిన్ హుడ్ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ఈ రోజు అఫీషియల్ గా ప్రకటించింది.
మైత్రీ మూవీ మేకర్స్ పుష్ప 2 సినిమా ఇంకా థియేటర్స్ లో ఉండటంతో తమ సంస్థ నుంచే మరో సినిమా పోటీ ఎందుకుని నిర్మాతలు భావించినట్లు ఉన్నారు. రాబిన్ హుడ్ పోస్ట్ పోన్ అవుతుందనే విషయం కొద్ది రోజుల క్రితమే బయటకు వచ్చింది. తాజాగా ఆ న్యూస్ ను కన్ఫర్మ్ చేశారు మేకర్స్. రాబిన్ హుడ్ సినిమాను దర్శకుడు వెంకీ కుడుముల రూపొందిస్తున్నారు.