దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ముంబై కోర్టులో షాక్ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో ఆయనకు ముంబైలోని అంథేరీ కోర్టు 3 నెలల జైలు శిక్ష విధించింది. వర్మపై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. రామ్ గోపాల్ వర్మ ఇచ్చిన చెక్ బౌన్స్ అయ్యిందంటూ మహేశ్ చంద్ర అనే వ్యక్తి కేసు వేశాడు.
ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు వర్మను దోషిగా తేలుస్తూ తీర్పు ఇచ్చింది. వర్మ ఫిర్యాదుదారుడికి 3.7 లక్షల రూపాయలు పరిహారంగా చెల్లించాలని లేని పక్షంలో 3 నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సిఉంటుందని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. 2018 నుంచి ఈ కేసు కోర్టు విచారణలో కొనసాగుతూ వస్తోంది.