దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హారర్ సినిమాలు చేయడం పేరున్నవాడు. ఎన్నో హారర్ సినిమాలతో ట్రెండ్ క్రియేట్ చేశాడు. అయితే గత కొంతకాలంగా సరైన సినిమా చేయడం లేదు. ఇటీవల శారీ అంటూ ఓ సినిమా తీసాడు. ప్రేక్షకులు సారీ అంటూ వర్మకు ఫ్లాప్ ఇచ్చారు. ఇక ఇప్పుడు తనకు బాగా పేరు తెచ్చిన హర్రర్ జానర్ లో మూవీ చేయాలి అనుకుంటున్నాడట వర్మ. మనోజ్ బాజ్ పాయ్ తో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది.
పోలీస్ స్టేషన్ మే భూత్ అనే టైటిల్‌తో ఈ సినిమాను రూపొందించనున్నాడు వర్మ. ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ కు ప్రాధాన్యత ఉంటుందట. మనోజ్ బాజ్ పాయ్ తో ఆర్జీవీ సినిమా కావడంతో దీనిపై ఎంతో కొంత ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. దెయ్యమైనా రామ్ గోపాల్ వర్మను ఆదుకుంటుందేమో చూడాలి.