ఒకప్పుడు హిట్ చిత్రాలు చేసిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు చెత్త సినిమాలు తీస్తున్నాడనే పేరు తెచ్చుకున్నాడు. తాజాగా తన సత్య మూవీని రీ రిలీజ్ చేశారు ఆర్జీవీ. సత్య చూసిన తర్వాత సోషల్ మీడియా ద్వారా వర్మ స్పందించారు. సత్య సినిమా చూసిన తర్వాత ఈ సినిమాను నేనేనా తీసిందని ఫీలయ్యానని.. చాలా ఎమోషనల్ గా అనిపించిందని వర్మ తెలియచేశారు.
అంతే కాకుండా.. ఇక నుంచి తను ఇంపాక్ట్ కలిగించేలా సినిమాలు వస్తాయన్నారు. సత్య సినిమాతో జ్ఞానోదయం అయ్యిందని.. ఆ సినిమా తీస్తున్నప్పుడు ఉన్న నిజాయితీ ఇప్పుడు కొరవడిందని.. ఇకపై మేల్కొని తనలో రియల్ ఫిల్మ్ మేకర్ ని బయటికి తీసుకొస్తానని సుదీర్ఘమైన పోస్టుని సోషల్ మీడియాలో షేర్ చేశారు వర్మ. సినీ అభిమానులు కోరుకుంటున్నది ఇదే.
ఒకప్పుడు శివ, క్షణక్షణం, రంగీలా, కంపెనీ, భూత్ లాంటి లైబ్రరి సినిమాలు తీసిన వర్మ మొన్నటి ఎన్నికల వరకు ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తూ ఏదేదో సినిమాలు తీశాడు. ఇప్పుడు తనలోని రియల్ ఫిల్మ్ మేకర్ ని బయటకు తీస్తానంటున్నాడు వర్మ. మరి.. నిజంగానే రియల్ ఫిల్మ్ మేకర్ అనిపించేలా సినిమాలు తీస్తాడో లేదో చూడాలి.