రివ్యూ – “టైగర్ నాగేశ్వరరావు” ట్రైలర్

రవితేజ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్ వచ్చేసింది. ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ నిర్మాణంలో దర్శకుడు వంశీ రూపొందిస్తున్నారు. నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. స్టువర్ట్ పురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ నెల 20 ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ట్రైలర్ పవర్ ఫుల్ విజువల్స్ తో సాగింది.

స్టువర్టుపరం దొంగలకు అడ్డా. అక్కడ పోలీస్ స్టేషన్స్ నుంచి పబ్లిక్ ప్లేసెస్ అన్నీ ఎవరెవరు దొంగతనం చేయాలో వేలం పాట పాడుతుంటారు. అదే టైమ్ లో కాకికాడ నుంచి మద్రాస్ వెళ్లే రైలును పోలీసులకు చెప్పి మరీ లూఠీ చేస్తాడు టైగర్ నాగేశ్వరరావు. కొట్టే ముందు, కొట్టేసే ముందు చెప్పడం నాకు అలవాటు అని పోలీసులకు సవాల్ విసురుతాడు టైగర్ నాగేశ్వరరావు. అతనంటే లోకల్ దొంగలకూ భయం మొదలవుతుంది. స్టువర్టు పురం మొత్తం టైగర్ నాగేశ్వరరావు చేతిలోకి వస్తుంది. ఇతన్ని వేటాడేందుకు ఓ పవర్ ఫుల్ పోలీసు రంగంలోకి దిగుతాడు. పోలీసులకు, టైగర్ నాగేశ్వరరావుకు ఎలాంటి ఫైట్ జరిగింది అనేది చూపిస్తూ ట్రైలర్ ఆసక్తికరంగా ముగుస్తుంది. ట్రైలర్ లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రస్థావన కూడా ఉంది.