వరుస ఫ్లాప్స్ తో యంగ్ హీరో రాజ్ తరుణ్ కెరీర్ ప్రశ్నార్థకంలో ఉందిప్పుడు. ఇలాంటి టైమ్ లో ఓ మాస్ ఎంటర్ టైనర్ తిరగబడర సామీ మూవీతో రాజ్ తరణ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించారు. సురక్ష ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో మల్కాపురం శివకుమార్ నిర్మించిన ఈ సినిమా టీజర్ ఇవాళ రిలీజైంది. తిరగబడర సామీ టీజర్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
తప్పిపోయిన పిల్లల్ని వెదికి తెచ్చి వాళ్ల ఫ్యామిలీలకు అప్పగిస్తుంటాడు హీరో. హీరో చేసే మంచి పనులకు ఫ్లాట్ అవుతుంది హీరోయిన్. వీళ్ల పెళ్లి కావడం ఆ తర్యాత చేసుకున్న రొమాన్స్ ఘాటుగానే ఉంది. బిత్తిరి సత్తితో కొన్ని కామెడీ సీన్స్ చేయించారు. తన దగ్గర కూడా ఓ పిల్లాడు తప్పిపోయాడని వాడిని వెతికి తెమ్మని చెబుతాడు విలన్. మరి ఆ పనిలో హీరో సక్సెస్ అయ్యాడా లేదా అనేది కథాంశంగా తెలుస్తోంది. ఈ పిల్లాడు హీరోనే కావొచ్చనే ట్విస్ట్ కూడా ఊహించుకోవచ్చు. గతంలో ఈ దర్శకుడు పిల్లా నువ్వు లేని జీవితం సినిమాలో విలన్ కు కథంతా చెప్పి ఆ కథలో వ్యక్తి నేనే అంటూ ట్విస్ట్ ఇస్తాడు. తిరగబడర సామీలోనూ స్క్రీన్ ప్లేలో అలాంటి మలుపులు ఉంటాయోమో. ఇక రాజ్ తరుణ్ తన కెరీర్ లో ఇప్పటిదాకా చేయనంత మాస్ ఫైట్స్, యాక్షన్ చేసినట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ దట్టించిన మాస్ ఎంటర్ టైనర్ గా తిరగబడర సామీ ఉండనుంది.