నటీనటులు – విక్రాంత్, మెహ్రీన్ ఫిర్జాద, రుక్సర్ థిల్లాన్, గురు సోమసుందరం, నాజర్, వెన్నెల కిషోర్, సుహాసినీ, సత్య, బ్రహ్మాజీ, రాజా రవీంద్ర, అన్నపూర్ణ తదితరులు
టెక్నికల్ టీమ్ – ఎడిటర్ – ప్రవీణ్ పూడి, సినిమాటోగ్రఫీ – ఏఆర్ అశోక్ కుమార్, మ్యూజిక్ – హేషమ్ అబ్దుల్ వాహాబ్, ప్రొడ్యూసర్ – లీలా రెడ్డి, బ్యానర్ – డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్స్, కథ, స్క్రీన్ ప్లే – విక్రాంత్
‘స్పార్క్ లైఫ్’ వంటి భారీ బడ్జెట్ చిత్రంతో టాలీవుడ్ లో హీరోగా అడుగుపెట్టారు విక్రాంత్. ఈ సినిమాకు ఆయన కథ, స్క్రీన్ ప్లే అందించడం విశేషం. డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమాలో మెహరీన్, రుక్షర్ థిల్లాన్‌లు హీరోయిన్లుగా నటించారు. ఇవాళ థియేటర్స్ లోకి వచ్చేసింది స్పార్క్ లైఫ్. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే
అందమైన అమ్మాయి లేఖ (మెహ్రీన్ ఫిర్జాద) కలలో ఓ కుర్రాడు కనిపిస్తాడు. కలలోనే అతన్ని ఇష్టపడుతుంది లేఖ. అయితే ఆ అబ్బాయి నిజ జీవితంలో లేఖకు కనిపిస్తాడు. అతనే జై (విక్రాంత్). ప్రేమించిన అబ్బాయి జై గురించి తెలుసుకునేందుకు అతన్ని ఫాలో అవుతుంటుంది లేఖ. మరోవైపు నగరంలో వరుస హత్యలు జరుగుతుంటాయి. ఈ హత్యలు ఎవరు చేస్తున్నారనేందుకు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు పోలీసులు. ఈ హత్యలు జై చేస్తున్నట్లు తెలుస్తుంది. జై ఈ హత్యలు ఎందుకు చేయాల్సివచ్చింది. అతనికి అనన్య(రుక్సర్ థిల్లాన్) తో ఉన్న రిలేషన్ ఏంటి. ఈ మర్డర్ మిస్టరీని పోలీసులు ఛేదించారా లేదా అనేది మిగిలిన కథ.
ఎలా ఉందంటే
ఇదొక ఇంట్రెస్టింగ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ. బిగినింగ్ నుంచి సినిమా ఆసక్తికరంగా మొదలవుతుంది. లేఖ కలలో జై కనిపించడం, అతను రియల్ లైఫ్ లోనూ ఎదురుపడటంతో కథ ఆసక్తికరంగా మారుతుంది. లేఖ జై గురించి తెలుసుకునేందుకు చేసే ప్రయత్నాలు ప్లెజంట్ గా సాగుతాయి. సరదాగా, ఇంట్రెస్టింగ్ గా ప్రారంభమయ్యే సన్నివేశాలు..క్రమంగా థ్రిల్లర్, మిస్టరీ జానర్ లోకి వెళ్తాయి. మర్డర్స్ కు కారణం జై అని తెలియడం ట్విస్ట్ అయితే..అతను ఎందుకు ఈ హత్యలు చేస్తున్నాడనేది మిగతా సినిమా మీద క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. ఒక్క సీన్ మిస్ అయితే కథలోని లింక్ పోతుందనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన క్రెడిట్ విక్రాంత్ రాసుకున్న స్క్రీన్ ప్లేదే అనుకోవాలి.
స్పార్క్ లైఫ్ కు ఆకర్షణ ఇందులోన కొత్త కాన్సెప్ట్ అని చెప్పుకోవాలి. ఆ కాన్సెప్ట్ ను స్క్రీన్ మీద ఎగ్జిక్యూట్ చేసిన తీరు మెప్పిస్తుంది. ఈ కథలో విక్రాంత్, మెహ్రీన్, రుక్సర్, గురు సోమసుందరం, నాజర్, వెన్నెల కిషోర్, సుహాసినీ తమ క్యారెక్టర్స్ కు పర్పెక్ట్ గా యాప్ట్ అయ్యారు. ఫస్ట్ మూవీలోనే జై క్యారెక్టర్ లో అన్ని ఎమోషన్స్ పలికించారు విక్రాంత్. ఎమోషన్, లవ్, యాక్షన్ వంటి అంశాల్లో విక్రాంత్ పర్ ఫార్మెన్స్ కన్విన్సింగ్ గా ఉంది. లేఖగా మెహ్రీన్, అనన్యగా రుక్సర్ బాగా నటించారు. స్పార్క్ లైఫ్ మూవీకి మరో హైలైట్ టెక్నికల్ బ్రిలియన్స్. ఏఆర్ అశోక్ కుమార్ సినిమాటోగ్రఫీ ప్రతి ఫ్రేమ్ ను కలర్ ఫుల్ గా మారిస్తే..హేషమ్ అబ్దుల్ వాహాబ్ మ్యూజిక్ సినిమా మూడ్ ను ఎలివేట్ చేసింది. మొత్తంగా స్పార్క్ లైఫ్ సినిమాను మూవీ లవర్స్ కంప్లీట్ గా ఎంజాయ్ చేయొచ్చు.
రేటింగ్ 3/5