రివ్యూ – సలార్

నటీనటులు – ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్, జగపతి బాబు, ఈశ్వరీ రావు, టినూ ఆనంద్ తదితరులు

టెక్నికల్ టీమ్ – సినిమాటోగ్రఫీ – భువన్ గౌడ, ఎడిటింగ్ – ఉజ్వల్ కులకర్ణి, మ్యూజిక్ – రవి బస్రూర్, నిర్మాణం – హోంబలే ఫిలింస్, రచన దర్శకత్వం – ప్రశాంత్ నీల్

ఈ ఏడాది మోస్ట్ అవేటెడ్ మూవీగా ప్రేక్షకుల ముందుకొచ్చింది స్టార్ హీరో ప్రభాస్ నటించిన సలార్ మూవీ. కేజీఎఫ్ క్రియేటర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ చేయడంతో సలార్ మీద హై ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. ఈ క్రేజ్ తో అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డులు సృష్టించిందీ సినిమా. ఇన్ని అంచనాలను సలార్ అందుకుందా లేదా రివ్యూలో చూద్దాం.

కథేంటంటే

ఖాన్సార్ సామ్రాజ్యానికి అధిపతి రాజ మన్నార్ (జగపతి బాబు). ఈ సామ్రాజ్యం చిన్న చిన్న ఊర్లుగా విభజించబడి ఒక్కో ప్రాంతం ఒక్కో దొర ఆధిపత్యంలో ఉంటుంది. రాజమన్నార్ తన తర్వాత తన కొడుకు వరద రాజమన్నార్ (పృథ్వీరాజ్ సుకుమారన్) ఖాన్సార్ కు అధిపతి కావాలని కోరుకుంటాడు. అయితే ఖాన్సార్ సింహాసనంపై కన్నేసిన ఖాన్సార్ లోని మిగతా ప్రాంత నాయకులు సొంత సైన్యంతో యుద్ధానికి సిద్ధమవుతారు. వరద రాజమన్నార్ ను చంపేందుకు ప్రయత్నిస్తారు. ఇలాంటి సమయంలో తన స్నేహితుడు దేవ (ప్రభాస్) సహాయం కోరతాడు వరద. ఈ భారీ సైన్యాలను ఎదురించేందుకు దేవ ఒక్కడే సిద్ధమవుతాడు. మరి ఆ సైన్యాలను దేవ ఎలా ఎదిరించాడు. దేవ సలార్ ఎలా అయ్యాడు, అతని నేపథ్యం ఏంటి, ఆద్యతో దేవ రిలేషన్ ఏంటి అనేది మిగిలిన కథ.

ఎలా ఉందంటే

కేజీఎఫ్ ప్రపంచంలో ఒక వీరుడిని హీరోగా చూపించిన దర్శకుడు ప్రశాంత్ నీల్. మరోసారి అలాంటి ప్రయత్నమే ఖాన్సార్ సామ్రాజ్యం నేపథ్యంగా రూపొందించాడు. ప్రభాస్ ఇమేజ్, స్టార్ డమ్ కు ఏమాత్రం తగ్గకుండా సలార్ ను తెరకెక్కించాడు. కేజీఎఫ్ తో పోల్చితే హీరోయిజం ఎలివేషన్స్ తక్కువే అయినా…ప్రభాస్ క్యారెక్టర్ ను చూపించిన విధానంతో రెబల్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతారు. కథలోని ఎమోషన్, డ్రామా నుంచి పక్కకు వెళ్లకుండా ఒక ప్యూర్ డ్రామాను తెరకెక్కించాడు దర్శకుడు. స్నేహితుడి కోసం ఎలాంటి సాహసమైనా చేసే ఫ్రెండ్ గా, తల్లి మాట వినే కొడుకుగా ప్రభాస్ నటన సూపర్బ్ అనిపిస్తుంది. ఆరు అడుగులతో ప్రభాస్ తెరపై కనిపించే విధానమే ఇంత పెద్ద యాక్షన్ ఎంటర్ టైనర్ ను కన్విన్స్ చేసిందని చెప్పాలి. స్టార్స్, హీరోలు కొన్ని కథలకు ఎంతగా యాప్ట్ అవుతారో, ఎంతగా ఆ కథలను ఎలివేట్ చేస్తారో అని చెప్పేందుకు సలార్ బెస్ట్ ఎగ్జాంపుల్.

సలార్ లో యాక్షన్ సీక్వెన్సులు హైలైట్ అని చెప్పుకోవాలి. కాటమ్మ తల్లికి బలి ఇచ్చే సీక్వెన్స్ చూపు తిప్పుకోకుండా ఉంది. ఇద్దరు చిన్ననాటి స్నేహితుల కథను వెయ్యేళ్ల కిందటి చరిత్రతో ముడిపెడుతూ చూపించిన విధానం సర్ ప్రైజ్ చేస్తుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ క్యారెక్టర్ కొన్ని చోట్ల కథకు లీడ్ తీసుకుంటుంది. అసలు కథ సెకండాఫ్ లోనే మొదలవుతుంది. సలార్ మొదటి భాగంలో సగం కథే చూపించినా ప్రేక్షకుడికి ఒక పూర్తి సినిమా చూసిన ఫీలింగ్ కలిగిస్తుంది. శృతి హాసన్ కు ఆద్య క్యారెక్టర్ లో పెద్దగా స్కోప్ లేదు. అయితే ఉన్నంతలో ఆమె తన ప్రెజెన్స్ తో ఆకట్టుకుంది. పృథ్వీరాజ్ వరదగా ఇంప్రెస్ చేశారు. టెక్నికల్ గా సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ఎడిటింగ్ , మేకింగ్ ఇలా..ప్రతి అంశంలో సలార్ ది బెస్ట్ అనిపించుకుంటుంది. ఖచ్చితంగా సలార్ ఒక వరల్డ్ క్లాస్ అటెంప్ట్ అని చెప్పాలి.