రివ్యూ – సైంధవ్

నటీనటులు : వెంకటేష్, శ్రద్ధా శ్రీనాథ్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, ముకేశ్ రుషి, రుహానీ శర్మ, ఆండ్రియా, బేబి సారా తదితరులు

టెక్నికల్ టీమ్ : మ్యూజిక్ – సంతోష్ నారాయణన్, సినిమాటోగ్రఫీ – యస్.మణికందన్,
ఎడిటర్- గ్యారీ బిహెచ్, నిర్మాత – వెంకట్ బోయనపల్లి, రచన దర్శకత్వం – శైలేష్ కొలను

సంక్రాంతి బరిలో ఉన్న పెద్ద సినిమాల్లో ఒకటి సైంధవ్. వెంకటేష్ 75వ మూవీగా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించారు. నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించిన సైంధవ్ ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.

కథేంటంటే

చంద్రప్రస్థ అనే కల్పిత నగరంలో భార్య మనో (శ్రద్ధా శ్రీనాథ్), కూతురు గాయత్రి (బేబి సారా)తో కలిసి జీవిస్తుంటాడు సైంధవ్ (వెంకటేష్). ఇతనికి సైకో అనే షార్ట్ నేమ్ ఉంటుంది. గతంలో కార్టెల్ అనే కంపెనీలో పనిచేసిన సైంధవ్ ..భార్య మనో కోరిక మేరకు ఆ కంపెనీ ఉద్యోగం వదిలేస్తాడు. సైంధవ్ హ్యాపీ లైఫ్ లో కూతురు గాయత్రికి జబ్బు చేయడం విషాధాన్ని నింపుతుంది. ఆమెకు స్పైనల్ మస్కులర్ అట్రోపీ అనే అనారోగ్యం ఉందని, ఆమెకు జబ్బు తగ్గాలంటే 17 కోట్ల రూపాయల ఖర్చు అయ్యే ఇంజెక్షన్ ఇవ్వాలని వైద్యులు చెబుతారు. సైంధవ్ అంత డబ్బు తీసుకొచ్చాడా లేదా, బిడ్డ ప్రాణాల్ని ఎలా కాపాడుకున్నాడు. కార్టెల్ కంపెనీ పేరుతో చిన్న పిల్లల అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల రవాణా చేస్తుంటారు వికాస్ మాలిక్ (నవాజుద్దీన్ సిద్ధిఖీ), మిత్ర (ముఖేష్ రుషి)తో సైంధవ్ పోరాటం ఎలా సాగింది అనేది మిగిలిన కథ.

ఎలా ఉందంటే

సైంధవ్ ను యాక్షన్ థ్రిల్లర్ గా మలిచే ప్రయత్నంలో దర్శకుడు శైలేష్ పూర్తిగా సక్సెస్ కాలేకపోయాడు. సైంధవ్ కథలో ఎమోషన్, యాక్షన్ రెండింటికీ చోటు ఉన్నా..వాటిని పర్పెక్ట్ గా మిక్స్ చేసి ఒక ఇంట్రెస్టింగ్ సినిమా చూపించలేకపోయాడు. సైంధవ్ తన కూతురికి ఇవ్వాల్సిన ఇంజెక్షన్ కోసం డబ్బు సంపాదించే క్రమంలో ఫస్టాఫ్ కొంత ఇంట్రెస్టింగ్ గా సాగినా..సెకండాఫ్ లో దర్శకుడు చేతులెత్తేశాడు. డబ్బు అందినట్లే అంది చేజారుతుండటంతో క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. అది చివరిదాకా సస్టెన్ కాలేదు. సైంధవ్ లో చాలా యాక్షన్ పార్టులు ఉన్నాయి. ఇవన్నీ కలిపి అదే సినిమా అన్నట్లుంది దర్శకుడి ఆలోచన. కథ మామూలుదే. ఇలాంటి సాధారణమైన కథకు స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్ గా ఉంటే ఆకట్టుకునేదే. ఆ కథనాన్ని ఇంకా సాధారణమైనదిగా రాసుకున్నారు. దీంతో స్క్రీన్ మీద సైంధ‌వ్ మ్యాజిక్ జరగలేదు. వెంకటేష్ తన సహజ సిద్ధమైన స్టైల్లో బాగా నటించారు. సైంధవ్ క్యారెక్టర్ గా మారిపోయాడు. ఆయన చేసిన యాక్షన్, చూపించిన ఎమోషన్ బాగున్నాయి. శ్రద్ధా శ్రీనాథ్, బేబి సైరా తమ క్యారెక్టర్స్ కు సరిపోయారు. విలన్స్ గా నవాజుద్దీన్ సిద్ధికీ, ముకేశ్ రుషి విలనీ ఓకే. కథ నిండా కావాల్సినంతమంది కాస్టింగ్ ఉన్నా..ప్రతి క్యారెక్టర్ కు ఒక పర్పస్ అంటూ లేకుండా పోయింది. ఒక కంప్లీట్ నెస్ ఆ క్యారెక్టర్స్ లో కనిపించలేదు. టెక్నికల్ గా చూస్తే సంతోష్ నారాయణ్ మ్యూజిక్, మణికందన్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకున్నాయి. మెమొరబుల్ గా ఉండిపోవాల్సిన సైంధవ్ …బాగా లేదన్న రీజన్ తో వెంకీ ఫ్యాన్స్ కు గుర్తుండిపోతుంది.