సినిమా పేరు – పాగల్ వర్సెస్ కాదల్
నటీనటులు – విజయ్ శంకర్, విషిక, షకలక శంకర్, బ్రహ్మాజీ, అనూహ్య సారిపల్లి, ప్రశాంత్ కూఛిబొట్ల తదితరులు
సాంకేతిక వర్గం – మ్యూజిక్ ప్రవీణ్ సంగడాల, ఎడిటింగ్, డీఐ – శ్యామ్ కుమార్.పి., సినిమాటోగ్రఫీ – నవధీర్, మ్యూజిక్ – ప్రవీణ్ సంగడాల, నిర్మాత – పడ్డాన మన్మథరావు, డైరెక్టర్ – రాజేశ్ ముదునూరి
ఈ రోజు రిలీజైన సినిమాల్లో యూత్ ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేసిన సినిమా పాగల్ వర్సెస్ కాదల్. టైటిల్ లోనే ఇది మన సినిమా అని యూత్ ఆడియెన్స్ భావించారు. లవ్ అండ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
స్టోరీ
రాత్రి డ్యూటీలో ఉన్న ఇద్దరు పోలీసులు (షకలక శంకర్, బ్రహ్మాజీ )లు బాగా తాగి అల్లరి చేస్తున్న ఓ యువకుడు (ప్రసాద్)ని అక్కడి నుంచి పంపించేందుకు ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో అతను తాను ఇలా తాగడం వెనక స్టోరీ చెబుతాడు. సినిమా డైరెక్షన్ చేయాలనుకునే ఈ పోలీస్ ఆఫీసర్ బ్రహ్మాజీ ఆ యువకుడి కథలో ఏదైనా పాయింట్ దొరుకుందా అని చెప్పేదంతా వింటాడు. అతను చెప్పిన స్టోరీలో కార్తీక్ (విజయ్ శంకర్) సివిల్ ఇంజినీర్ గా టాలెంట్ ఉన్న కుర్రాడు. అతను స్కెచ్ గీస్తే బిల్డర్ అడ్వాన్స్ ఇవ్వాల్సిందే. అంత టాలెంటెడ్ అబ్బాయి. ప్రియ (విషిక) అనే అమ్మాయిని ఇష్టపడిన కార్తీక్ ఆమెకు ప్రపోజ్ చేసేందుకు వెళ్తాడు. నువ్వు నాతో ఉండలేవు వెళ్లిపో అని ముందే కార్తీక్ కు వార్నింగ్ ఇస్తుంది ప్రియ. కానీ అతను పట్టించుకోడు. ఆమెను లవ్ చేయకుండా ఉండలేకపోతాడు. ప్రియ ఈగోకు బ్రాండ్ అంబాసిడర్. కార్తీక్ ను ముప్పు తిప్పలు పెడుతుంది. అతనికి ఓ మంచి ఉద్యోగం వస్తే నా కంటే ఉద్యోగం ఎక్కువా అని అతన్ని ఆపేస్తుంది. ఇలా ప్రియ ఎంత ఇబ్బంది పెట్టినా కార్తీక్ కు ఆమెపై ఏమాత్రం కోపం రాదు. ప్రియ బ్రదర్ మనోజ్ ఒక మానసిక వైద్యుడు. కార్తీక్ సోదరి అమృత (అనూహ్య సారిపల్లి) మనోజ్ ను లవ్ చేస్తుంది. కానీ అమృత లవ్ ను మనోజ్ ఒప్పుకోడు. ఒకవైపు కార్తీక్ ప్రియ, మరోవైపు మనోజ్ అమృత…వేర్వేరు మనస్తత్వాలు గల రెండు జంటలు. ఈ రెండు జంటలు ఎలా ఒక్కటయ్యాయి అనేది మిగిలిన కథ.
రివ్యూ
అబ్బాయిల లవ్ విషయంలో అమ్మాయిలు చాలా సెల్ఫిష్ గా ఉంటారనేది నిజం. అందరు కాకున్నా మేజర్ గా ఇలాగే అమ్మాయిలు ఆలోచిస్తుంటారు. ప్రేమించిన వాడు తనకన్నా ఏదీ ఎక్కువ కాదని అనుకోవాలని భావిస్తారు. లవ్ లో అబ్బాయిలు ఫేస్ చేసే ఈ పాయింట్ తో పాగల్ వర్సెస్ కాదల్ సినిమాను రూపొందించారు దర్శకుడు రాజేష్ ముదునూరి. దేవరకొండలో విజయ్ ప్రేమకథ, ఫోకస్ వంటి చిత్రాలతో యంగ్ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ శంకర్ లీడ్ రోల్ లో నటించారు. క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్ ఇది. కార్తీక్, ప్రియ, అమృత, మనోజ్, ప్రసాద్ అనే ఐదు కీలక పాత్రల మధ్య కథ సాగుతుంది. ఈ పాత్రలతోనే మంచి ఫన్ ఎంటర్ టైన్ మెంట్ జెనరేట్ అయ్యింది. ప్రేమ కథల్లో ఇది డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు.
కార్తీక్ పాత్రలో విజయ్ శంకర్ తన నటనతో మెప్పించాడు. చాలా న్యాచురల్ గా పర్ ఫార్మ్ చేశాడు. మనం రోజూ చూసే ఒక డీసెంట్ కుర్రాడు ఎలా ఉంటాడో అలా కనిపించాడు. ఇక ప్రియ పాత్రలో విషిక సైకోయిజాన్ని ది బెస్ట్ గా చూపించింది. ఆమె కమిటీ కుర్రాళ్లు సినిమా కూడా ఈరోజే థియేటర్స్ లోకి వచ్చింది. అమృతగా అనూహ్య సారిపల్లి కూల్ గా పర్ ఫార్మ్ చేసింది. హీరోకి చెల్లిగా ఆమెది టైలర్ మేడ్ రోల్. ఈగో సైకియాట్రిస్ట్ గా మనోజ్ పాత్రలో ప్రశాంత్ బాగా సరిపోయాడు. మ్యూజిక్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ..ఇలా టెక్నికల్ గా మూవీ బాగుంది. ఓ మంచి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ చూడాలంటే పాగల్ వర్సెస్ కాదల్ కు వెళ్లొచ్చు.
రేటింగ్ 3/5